MDK: మెదక్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న నేషనల్ హైవే 765-డీజీ రోడ్డు మరమ్మత్ పనులను కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.