PDPL: ధర్మారం మండలం సాయంపేట గ్రామ ఎక్స్ రోడ్డు RTC బస్ స్టాప్ వద్ద నూతన బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూస శ్రీవాణి, ఉప సర్పంచ్ దయ్యాల రజిత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.