MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూజారి మల్లేష్ కుటుంబానికి గ్రామస్తులు రూ.47,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పూదరి మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 15న మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు విరాళాలు సేకరించారు. అలా వచ్చిన మొత్తం రూ.47,500ను ఆదివారం పూదరి మల్లేష్ కుటుంబ సభ్యులకు గ్రామస్తులు అందజేశారు.