CTR: వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇల్లు తాళం వేసి ఎక్కువ రోజులు ఊరెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ఊరు వెళ్లేటప్పుడు ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును లాకర్లలో భద్ర పరచుకోవాలి అని సూచించారు.