SRPT: జిల్లాలో ఏప్రిల్ ఎండల తీవ్రత పౌల్ట్రీ రైతుల పాలిట శాపంగా మారింది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో వడదెబ్బకు తాళలేక కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. షెడ్లలో ఫ్యాన్లు, కూలర్లు వంటి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.