ATP: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కళ్యాణదుర్గంలో ఘన స్వాగతం లభించింది. స్వర్గీయ ఉన్నం హనుమంతరాయ చౌదరి సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొద్దీన్ సాదర స్వాగతం పలికారు. చౌదరి క్యాంపు కార్యాలయం వద్ద మంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించారు.