ELR: విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఇవాళ నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. కార్పోరేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.