GDWL: ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లిలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ లక్ష్మీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవికుమార్, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.