SRPT: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలని సీడీపీవో శ్రీజ అన్నారు. బుధవారం జాజిరెడ్డి మండలం అర్వపల్లిలో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి రోజు తీసుకునే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వలన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు.