SRD: హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భగవంతుని కృపతో త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు.