WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని మోస్తరు వర్షం కురిసింది. పొద్దంతా తీవ్ర ఎండతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. అయితే మొక్కజొన్న రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. పొలాల్లో ఉన్న ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు పరదాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.