AP: కేరళంలో జనసేన విస్తరణకు అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు తిరువనంతపూరంలో జనసేన నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేరళంలోని వివిధ పార్టీల నుంచి పలువురు జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్సీ నాగబాబు, రామ్ తాళ్లూరి కండువా కప్పి ఆహ్వానించారు. పవన్ సిద్ధాంతాలకు భాషా భేదం లేదని నాగబాబు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన జెండా పాతడమే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తోంది.