GNTR: పెదకాకానిలో సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానికులు హాజరయ్యారు.