నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 26, 2026న సాయంత్రం 5:30 గంటలకు జెమిని టీవీలో టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.