మైత్రీ మూవీ మేకర్స్ రూట్ మార్చి, ప్రశాంత్ నీల్ సమర్పణలో ‘418’ అనే పక్కా హారర్ సినిమాను అనౌన్స్ చేసింది. కీర్తన్ నాదగౌడ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం పోస్టర్ SMలో వైరల్ అవుతోంది. ‘నవ్వింది చాలు.. ఇక భయపడాల్సిన సమయం వచ్చింది’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ మూవీలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.