KDP: దక్షిణ కాశీగా పేర్కొన్న పుష్పగిరిలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి వైద్యనాథేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అక్షయ తృతీయ కావడంతో, పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కమలాపురం MLA చైతన్య రెడ్డి చెన్నకేశవ స్వామి, వైద్య నాదేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.