దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నందున రాష్ట్రంలోని ఏసీబీ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.