NGKL: బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో అధికారులు భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 261 బస్తాల్లో ఉన్న సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు.