SRCL: చందుర్తి మండలం, ఆశిరెడ్డిపల్లి, సనుగుల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొజ్జ మల్లేశం, మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. వినూత్నమైన బోధన అభ్యసన కృత్యాలతో ఒత్తిడి లేని చదువులు చెప్పడం జరుగుతుందన్నారు.