ASR: నెలవారీ తనిఖీల్లో భాగంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచి ఉన్న ఈవీఎం గోదాములను రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, డిప్యూటీ తహసీల్దార్లతో కలిసి గురువారం జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వరరావు తనిఖీ చేశారు. ఈవీఎం గోదాముకు వేసిన సీళ్లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు.