MBNR: మహబూబ్నగర్ జైలులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ నేత బసిరెడ్డి సంతోష్ రెడ్డిని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ములాఖత్ ద్వారా కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతోందని వారు మండిపడ్డారు. న్యాయపోరాటం ద్వారా నిజాన్ని నిరూపిస్తామని భరోసా ఇచ్చారు.