GDWL: గద్వాలలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరుతూ ఎంపీ డీకే అరుణ ప్రతినిధులను కార్మికులు కలిశారు. డీకే బంగ్లాలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, అంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు.