MHBD: సంక్షేమ వారోత్సవాలలో భాగంగా నర్సింహులపేట పాఠశాలలో గురువారం పేరెంట్స్, టీచర్ మీటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సన్మార్గంలో నడిచేందుకు తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఎంతో అవసరం అన్నారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు తప్పుదారుల్లో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.