MLG:గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ జీకె గుంపును ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ సందర్శించారు. గుత్తికోయ గిరిజనుల సమస్యలు విన్న ఆయన వంతెన, రహదారి, తాగునీరు, విద్యుత్ అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, డ్రాప్అవుట్లు లేకూడదన్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.