TG: రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు, MLAల జీతాల్లో 50% కోత విధించి, ఆ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సహకార సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.