KMM: మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జి. శంకర్ నూతన ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. శంకర్ మాట్లాడుతూ.. కళాశాలలో అడ్మిషన్లు పెంచడం, డ్రాప్‌అవుట్స్ తగ్గించడం, ఉత్తీర్ణత శాతం పెంపు కోసం కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీజీవో నాయకులు నయుమ్ పాషా, గణేష్, భరత్ పాల్గొన్నారు.