SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామంలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గత వారం రోజులుగా తీవ్ర ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురైనా గ్రామానికి చెందిన బాధితులు షేక్.మన్సూర్, బండారు మైసయ్యలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఎండల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.