CTR: పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు జరతున్నాయి. 6వ రోజు ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యాధికారులతో పాటు నర్సులకు,సెక్యూరిటీ సిబ్బందికి ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. తదుపరి అక్కడ వారికి కరపత్రాలు బ్రోచర్స్ను పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101కు ఫోన్ చేయాలని తెలిపారు.