BDK: జిల్లాలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, మీ సేవ కేంద్రాల మేనేజర్లతో గూగుల్ మీట్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతుకు 14 అంకెల గుర్తింపు సంఖ్యను కేంద్రం కేటాయించిందన్నారు.