NLG: దేవరకొండ బీజేపీ మున్సిపల్ శాఖ ఉపాధ్యక్షులు కాసుల శంకరయ్య ఆధ్వర్యంలో చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఆదివారం బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ అడ్డుగా మారిందన్నారు.