AP: ఎస్సీ, ఎస్టీలు రాయితీతో ఉచిత సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతర వర్గాలకు 40 శాతం వరకు రాయితీతో రాయితీతో సోలార్ ప్యానళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించవచ్చని చెప్పారు.