MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి యువత కోసం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. క్రీడా ప్రాంగణాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో యువత క్రీడలకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.