JGL: కోరుట్ల మున్సిపల్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను, సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని సుమారు రూ.12 వేల వరకు జరిమానా విధించారు. ఇంట్లో నుంచి వచ్చే చెత్తను తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేసి సిబ్బందికి ఇవ్వాలని సూచించారు.