BDK: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు గురుకులాల్లో విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను విశ్లేషించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.