ADB: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోనాల మండలంలోని ఘన్పూర్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు మంగళవారం ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు స్థానికులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.