NRPT: జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో దీర్ఘకాలంగా కొనసాగుతున్న లో ఓల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. కౌన్సిలర్ అంబికా శ్రీనివాస్ సమస్యను మున్సిపల్ ఛైర్మన్, విద్యుత్ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. కేంద్ర ‘సౌభాగ్య’ పథకం కింద మంజూరైన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ మంగళవారం పూజ చేసి ప్రారంభించారు. దీంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.