మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో ‘మెగా 158’ మూవీ పట్టాలెక్కబోతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మేలో షూటింగ్ మొదలుకానున్న నేపథ్యంలో తాజాగా చిరుకి లుక్ టెస్ట్ నిర్వహించారట. ఇందులో మెగాస్టార్ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారట. వింటేజ్ చిరు మార్క్ మాస్ అంశాలు, హై-వోల్టేజ్ యాక్షన్తో ఈ చిత్రం ఉండబోతోంది.