NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రమాదాల నివారణకు పంచాయతీ పాలకవర్గం ఇవాళ చర్యలు చేపట్టారు. వెంబావి నుంచి ఎలికట్టె వెళ్లే రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్లకు వైట్ పెయింట్ వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అలివేలు వెంకన్న మాట్లాడుతూ.. వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు.