AP: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా సత్తా చాటింది. ఫస్టియర్ (90%), సెకండియర్ (92%) ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా (88%) రెండో స్థానంలో నిలవగా.. ఫస్టియర్లో వైజాగ్ (85%), సెకండియర్లో ఎన్టీఆర్ జిల్లా (87%) మూడో స్థానంలో నిలిచాయి. కేవలం 62% ఉత్తీర్ణతతో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానానికి పరిమితమైంది.