WGL: నల్లబెల్లి(M)లోని రుద్రగూడెం GPలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పండించిన మొక్కజొన్నను ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క రైతు నుంచి 25 క్వింటాళ్లకే పరిమితం చేయడం వల్ల నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు పూర్తి ధాన్యాన్ని తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.