TG: సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. పార్టీ వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, నామినేటెడ్ పదవుల భర్తీ, పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ ఛైర్మన్ల రెన్యూవల్‌పై, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జిల్లాల్లో జరిగే భేటీలు, జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై చర్చించారు.