AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు ప్రకటించింది. మే 21 నుంచి జూన్ 4 వరకు థియరీ పరీక్షలు ఉదయం (9-12), మధ్యాహ్నం (2:30-5:30) షిఫ్టుల్లో జరుగుతాయని చెప్పింది. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొంది. మార్కులపై సంతృప్తి లేని వారు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.