MBNR: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల సభ నిర్వహించనున్నారు. ఈ సభలో రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలపై చర్చించనున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.