BDK: భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా శిశు మరణాలు చోటుచేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత ఘటనలపై చర్యలు తీసుకున్నప్పటికీ మళ్లీ ఇలాంటి సంఘటన జరగడం పర్యవేక్షణ లోపాన్ని చూపుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ వైద్యంపై ఉన్న నమ్మకం దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని వైద్య సేవలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.