TG: మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే తాము అసెంబ్లీలో దీనికి అనుకూలంగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. రాజ్యసభలో తమ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతారని స్పష్టం చేశారు.