PDPL: రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 7న స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు అధికార ప్రతినిధి ముప్పిడి రవీందర్ రెడ్డి గురువారం తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొంటారని అన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు రిటైర్డ్ కార్మిక కుటుంబాలు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు.