RR: రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ చౌరస్తాలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం జీవించే వారు ఎప్పటికీ ప్రజా హృదయాల్లో నిలిచిపోతారని కొనియాడారు.