SRCL: సహారా ఇండియాలో డబ్బులు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ప్రభుత్వం వెంటనే డబ్బులు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్ ముందు సహారా బాధితులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఆస్తులను జప్తు చేసుకుని ఖాతాదారులకు డబ్బులు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు.