BDK: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా పనుల ప్రారంభంలో జాప్యంపై అధికారులు శుక్రవారం సీరియస్ అయ్యారు. తొలి విడతలో 17,581 ఇళ్లు మంజూరు కాగా, సుమారు 1,600 మంది లబ్ధిదారులు ఇంకా పునాదులు కూడా తీయలేదు. గడువులోగా పనులు మొదలుపెట్టని పక్షంలో మంజూరీని రద్దు చేసి, ఇతర అర్హులకు కేటాయిస్తామని అధికారులు హెచ్చరించారు.