NZB: ముగ్పాల్ మండలం ముదక్పల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.